బండ్ల గ‌ణేశ్‌కి కరోనా పాజిటివ్‌ ఎఫెక్ట్: ఫాంహౌస్‌కి వెళ్లిపోయిన హీరో నాగ శౌర్య

  • బండ్ల గణేశ్ ఉండే ప్రాంతంలోనే ఉంటోన్న నాగశౌర్య
  • కుటుంబంతో కలిసి ఫాంహౌస్‌కు షిఫ్ట్‌
  • ప్రస్తుతం ఆయన చేతిలో ఓ సినిమా
సినీ నిర్మాత బండ్ల గ‌ణేశ్‌కు క‌రోనా పాజిటివ్‌ అని నిర్ధరణ అయిన విషయం తెలిసిందే. ఆయన నివ‌సించే ప్రాంతంలోనే సినీనటుడు నాగ‌శౌర్య ఉంటాడు. బండ్ల గణేశ్‌కు కరోనా సోకిన నేపథ్యంలో ముందు జాగ్రత్తల్లో భాగంగా నాగ‌శౌర్య త‌న కుటుంబంతో కలిసి ఫాంహౌస్‌కి వెళ్లిన‌ట్లు తెలిసింది.

ప్ర‌స్తుతం ఆయన సినిమా షూటింగుల్లో పాల్గొనే అవకాశం కూడా లేకపోవడంతో హైద‌రాబాద్‌లోని త‌న ఫాం హౌస్‌‌లో కొద్ది రోజులు ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. కాగా, ప్రస్తుతం ఆయన ఓ సినిమాలో నటిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో షూటింగులకు విరామం వచ్చింది. లాక్‌డౌన్ పూర్తయ్యాక ఆయన సౌజ‌న్య ద‌ర్శ‌క‌త్వంలో మరో సినిమాలోనూ నటించనున్నాడు.

naga shourya
Tollywood
Corona Virus

More Telugu News